Ad Code

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడొద్దు : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి


హైదరాబాద్ లోని ఐసీసీసీలో ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. భారతీయ విద్యా భవన్, జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్‌లల్లో ఉన్న మౌలిక సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉండాలనిసూచించారు. ఈ సమావేశానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణా రెడ్డి , విద్యాశాఖ కార్యదర్శిగా యోగితా రాణా , కళాశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్, అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని మార్గనిర్దేశం చేశారు. బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌లో తప్పనిసరిగా పాలు ఆదించాలని నిర్దేశించారు. ఇందుకోసం విజయా డైరీ నుంచి పాలు సేకరించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత కోసం ఏఐ టెక్నాలజీ వినియోగించాలని దిశనిర్దేశం చేశారు. కోర్ అర్బన్ రీజియన్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కొక మండలంలో ఆరుట్ల స్కూల్ తరహాలో ట్రాన్స్‌పోర్ట్‌తో సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ట్రాన్స్‌పోర్ట్ కోసం ఎలక్ట్రికల్ బస్సుల ఏర్పాటు పైన అధ్యయనం చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ స్కూల్స్‌లో నిబంధనలకు మించి ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దుతో పాటు రికవరీ చేసేలా నిబంధన విధించాలని హుకుం జారీ చేశారు. ప్రైవేట్ స్కూల్స్‌లో ఫీజుల నియంత్రణకు సంబంధించి రికమండేషన్స్‌ని ప్రజాభిప్రాయం కోసం వెబ్‌సైట్‌లో ఉంచాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అలాగే, ఎంసీహెచ్​ఆర్​డీలో గ్రూప్​ 2, 3 ఆఫీసర్ల శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు.

Post a Comment

0 Comments

Close Menu