Ad Code

అదుపు తప్పి అనేక వాహనాలను ఢీ కొట్టిన ఫెరారీ కారు : పలు కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసం


హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఫెరారీ కారు అదుపు తప్పి అనేక వాహనాలను ఢీ కొట్టింది. పలు కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు అయింది. రోడ్డు మధ్యలోని లైట్ మాస్ట్ సైతం ఒరిగిపోయింది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త క్రాంతి రెడ్డి ఈ కారును నడుపుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఫెరారీ (నంబర్ టీఎస్ 07 హెచ్ కే 8797) కారును వేగంగా డ్రైవ్ చేస్తోన్నప్పుడు దాని బ్రేకులు పనిచేయకపోవడం, హఠాత్తుగా స్టీరింగ్‌ లాక్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. ఈ ఘటనతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ధ్వంసమైన వాహనాలను తొలగించి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ట్రాఫిక్ భారీగా ప్రభావితం కావడంతో పలు వాహనాలను దారి మళ్లించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు.అధిక వేగం కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, కారు పక్క రోడ్డుపైకి దూసుకెళ్లి, ఎదురుగా వస్తోన్న వాహనాలతో పాటు అక్కడ పార్క్ చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలతో సైతం ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు.


Post a Comment

0 Comments

Close Menu