కర్ణాటకలోని బళ్లారికి చెందిన ఆటో డ్రైవర్ సిద్ధారెడ్డికు ‘హీరో స్ప్లెండర్’ బైక్‌లంటేనే అమితమైన మోజు. రోడ్డు మీద ఏ స్ప్లెండర్ బైక్ కనిపించినా ఇతని చేయి ఊరుకునేది కాదు. ఎలాగైనా దాన్ని కాజేయాల్సిందే. బళ్లారి, విజయనగర, చిత్రదుర్గ వంటి వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ, కేవలం ఈ నిర్దిష్ట మోడల్ బైక్‌లను మాత్రమే టార్గెట్ చేసేవాడు. చాలా సులువుగా వాటి తాళాలు తీసి, బైక్‌లను దొంగిలించి ఇతర ప్రాంతాల్లో విక్రయించేవాడు. వరుసగా స్ప్లెండర్ బైక్‌లు మాయమవుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే ‘స్ప్లెండర్ సిద్ధారెడ్డి’ పోలీసుల నిఘాలో పడి, ఎట్టకేలకు పట్టుబడ్డాడు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయి. అతని వద్ద నుండి ఏకంగా 41 స్ప్లెండర్ బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సిద్ధారెడ్డిని జైలుకు తరలించి, దీని వెనుక ఇంకా ఎవరి హస్తమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments