8849 ట్యాంక్ 5 స్మార్ట్ ఫోన్ : ఇంట్లోనే థియేటర్

చైనా బ్రాండ్ "8849". ఇప్పుడు లేటెస్ట్ గా స్మార్ట్‌ఫోన్ అంటే కాల్స్, సోషల్ మీడియా, ఫోటోగ్రఫీ, గేమింగ్‌కే పరిమితం అనే అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేందుకు సిద్దమైంది. 8849 ట్యాంక్ 5 పేరుతో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ రగ్గడ్ స్మార్ట్‌ఫోన్‌. ఏకంగా ఇన్‌బిల్ట్ 2K ప్రొజెక్టర్ తో రావడం టెక్ మార్కెట్లో సంచలనంగా మారింది . దీంతో ఎలాంటి అదనపు ప్రొజెక్టర్ అవసరం లేకుండానే గోడపై పెద్ద స్క్రీన్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ప్రెజెంటేషన్లు, వీడియోలు చూడొచ్చు. అంతే కాకుండా దీనికి తోడు భారీ 17,600mAh బ్యాటరీ, MediaTek Dimensity 9400e ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్, 36GB వరకు RAM, 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ వంటి హైఎండ్ ఫీచర్లతో ఈ ఫోన్ టెక్ ప్రపంచంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సాధారణ స్మార్ట్‌ఫోన్‌లకు భిన్నంగా ఉండే ఈ స్మార్ట్ ఫోన్.. ఒక పూర్తి స్థాయి మల్టీమీడియా పవర్‌హౌస్ గా నిలుస్తోంది. కీ ఫీచర్స్ అన్నీ ఒకే డివైస్‌లో అందించడం దీని ప్రత్యేకత. కొత్త టెక్నాలజీని ఇష్టపడేవారు, ప్రయాణాల్లో వినోదాన్ని ఆస్వాదించాలనుకునేవారు, అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నవారు దీనిని తప్పకుండా పరిశీలించవచ్చు. దీనిలో ఉన్న అతిపెద్ద ప్రత్యేకత దాని 2K హై-రెజల్యూషన్ DLP ప్రొజెక్టర్. 220 ల్యూమెన్స్ బ్రైట్‌నెస్తో ఇది సాధారణ మొబైల్ ప్రొజెక్టర్ల కంటే మెరుగైన విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. చీకటి గదిలో థియేటర్ అనుభూతిని కలిగించడమే కాకుండా, తక్కువ వెలుతురులో కూడా స్పష్టమైన చిత్రాన్ని ప్రదర్శించగలదు. ఈ ప్రొజెక్టర్‌లో ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్ కరెక్షన్ ఫీచర్లు ఉండటంతో గోడపై చిత్రం ఎటువంటి వంకరలు లేకుండా సరిగ్గా కనిపిస్తుంది. మీటింగ్‌లు, ఆఫీస్ ప్రెజెంటేషన్లు, అవుట్‌డోర్ క్యాంపింగ్, కుటుంబంతో సినిమా నైట్ వంటి సందర్భాల్లో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రొజెక్టర్‌తో పాటు ఈ ఫోన్‌లో 97dB హై పవర్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. ఇవి గట్టిగా, స్పష్టంగా ఆడియో అందిస్తూ సినిమా హాల్‌ను తలపించే అనుభూతిని కలిగిస్తాయి. మ్యూజిక్ వినడం, వీడియోలు చూడడం, గేమింగ్ చేయడం వంటి అన్ని సందర్భాల్లో అద్భుతమైన సౌండ్ క్వాలిటీని అందిస్తాయి.  6.73 అంగుళాల 3K AMOLED డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, HDR సపోర్ట్‌తో స్క్రోలింగ్, వీడియో స్ట్రీమింగ్, గేమింగ్ మరింత స్మూత్‌గా ఉంటుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించడంతో పాటు, AMOLED ప్యానెల్ కారణంగా రంగులు మరింత సహజంగా, కాంట్రాస్ట్ అద్భుతంగా కనిపిస్తాయి. ఈ ఫోన్‌కు గుండెకాయగా 3nm MediaTek Dimensity 9400e ప్రాసెసర్ పనిచేస్తుంది. ఇది అత్యంత వేగవంతమైన పనితీరును అందించే ప్రీమియం చిప్‌సెట్‌లలో ఒకటి. ఇందులో 18GB ఫిజికల్ RAM, 18GB వర్చువల్ RAM.. మొత్తం 36GB వరకు RAM సపోర్ట్ ఉంటుంది. 512GB ఇంటర్నల్ స్టోరేజ్.. 2TB వరకు microSD కార్డ్ సపోర్ట్ ఉండటంతో భారీ గేమ్స్, 4K వీడియో ఎడిటింగ్, మల్టీటాస్కింగ్, AI యాప్స్ అన్నింటినీ సులభంగా నిర్వహించగలదు.  వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా.. 50MP టెలిఫోటో కెమెరా, 50MP నైట్ విజన్ కెమెరా అందించారు. నైట్ విజన్ సెన్సార్ వల్ల తక్కువ వెలుతురులో కూడా స్పష్టమైన ఫోటోలు, వీడియోలు తీయొచ్చు. అడ్వెంచర్ ట్రిప్స్, క్యాంపింగ్, వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరాను అందించారు. వీడియో కాల్స్, సోషల్ మీడియా కంటెంట్ కోసం మంచి క్వాలిటీని అందిస్తుంది. ఈ ఫోన్‌లో ఉన్న 17,600mAh బ్యాటరీ మార్కెట్లో లభించే సాధారణ స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే చాలా పెద్దది. దీని వల్ల ఒకసారి ఛార్జ్ చేస్తే అనేక రోజుల పాటు సాధారణ వినియోగం.. గంటల తరబడి వీడియో ప్లేబ్యాక్. దీర్ఘకాలిక గేమింగ్, ప్రొజెక్టర్ వినియోగం సులభంగా చేయవచ్చు. అంతేకాదు, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో భారీ బ్యాటరీ అయినప్పటికీ సుమారు 90 నిమిషాల్లోనే పూర్తి ఛార్జ్ అవుతుంది. ఇది రగ్గడ్ స్మార్ట్‌ఫోన్. దీని బలమైన నిర్మాణం కారణంగా దుమ్ము, నీరు, షాక్‌లు, చిన్నపాటి పడిపోవడం వంటి పరిస్థితులను తట్టుకునేలా రూపొందించారు. అడ్వెంచర్ లవర్స్, ట్రెక్కింగ్ చేసే వారు, ఫీల్డ్ జాబ్స్ చేసే వారికి ఇది మంచి ఎంపికగా నిలుస్తుంది.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains