Ad Code

ఇల్లు కొన్నాక బిల్డర్ అప్పగించడంలో ఆలస్యం చేస్తే కొనుగోలుదారులు పరిహారం కోరవచ్చు : సుప్రీంకోర్టు

ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేసిన తర్వాత, బిల్డర్ దానిని అప్పగించడంలో ఆలస్యం చేస్తే, ఇంటిని స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా కొనుగోలుదారులు పరిహారం కోరవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇల్లు తీసుకున్న తర్వాత రియల్ ఎస్టేట్ సంస్థలపై ఫిర్యాదు చేసే హక్కు కొనుగోలుదారులకు ఉండదనే భావన సరికాదని పేర్కొంది. నేషనల్ కన్స్యూమర్ డిస్‌ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్  2016లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇల్లు స్వాధీనం చేసుకున్న తర్వాత ఫిర్యాదు చేస్తే, వారు 'వినియోగదారులు' కారని NCDRC గతంలో పేర్కొనగా, సుప్రీంకోర్టు దానిని తోసిపుచ్చింది. 2003లో ఢిల్లీలోని ఒక కో-ఆపరేటివ్ గ్రూప్ హౌసింగ్ సొసైటీలో ఫ్లాట్ కొనుగోలు చేసిన వ్యక్తి, ఇల్లు అప్పగించడంలో ఆలస్యం జరిగిందని ఫిర్యాదు చేస్తూ దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఇరుపక్షాల మధ్య కుదిరిన ఒప్పందంలో 'ఆర్బిట్రేషన్ క్లాజ్' (మధ్యవర్తిత్వ నిబంధన) ఉన్నప్పటికీ, కొనుగోలుదారులు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయకుండా ఆపలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. వస్తువులు లేదా సేవలలో లోపాలు ఉంటే, వినియోగదారుల రక్షణ చట్టం (1986) ప్రకారం కొనుగోలుదారులు ఫిర్యాదు చేయవచ్చని, వారికి సత్వర న్యాయం అందించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యమని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. 2003లో ఢిల్లీలోని ఒక కోఆపరేటివ్ గ్రూప్ హౌసింగ్ సొసైటీలో ఫ్లాట్ కొనుగోలు చేసిన వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. వస్తువులు లేదా సేవలలో లోపం ఉంటే త్వరితగతిన న్యాయం పొందడం కోసం వినియోగదారుల రక్షణ చట్టాన్ని (1986) సద్వినియోగం చేసుకోవాలని కోర్టు సూచించింది.

Post a Comment

0 Comments

Close Menu