Ad Code

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా తీసుకొచ్చిన పథకం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పాల్గొని మాట్లాడుతూ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ప్రజలను ఘోరంగా మోసం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా తీసుకొచ్చిన పథకం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి దాదాపు రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెండింగ్‌లో పెట్టారు. ఈ నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్రకు ఈ ప్రభుత్వం తెరలేపింది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారు. కోటీశ్వరుల ముచ్చట పక్కన పెడితే, కనీసం లక్షాధికారులను కూడా చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని నమ్మబలికింది. కానీ ఈ ప్రభుత్వ తీరు చూస్తుంటే తులం బంగారం కాదు కదా, కనీసం తులం ఇనుము కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని, గ్రౌండ్ లెవెల్‌లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల పక్షాన ఉండి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu