వివాహితను ప్రేమ పేరుతో వేధించినందుకు హోంగార్డుపై కేసు నమోదు
హైదరాబాద్ లోని చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌కు చెందిన హోం గార్డుపై ఓ వివాహితను ప్రేమ పేరుతో వేధించినందుకు చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు. తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను బయటపెడతానని బెదిరిస్తూ వేధింపులకు హోం గార్డు పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తూ, సంబంధిత ఆధారాలను సేకరిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యాక హోం గార్డుపై తదుపరి చర్యలు తీసుకుంటామని చైతన్యపురి పోలీసులు తెలిపారు.