Ad Code

జులై 3న రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్ కారు విడుదల ?


మార్కెట్‌లోకి రెనో ఇండియా సరికొత్త అత్యంత చౌకైన కారు రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్ ను తీసుకురాబోతుంది. ఈ కారు వచ్చే నెల 3వ తేదీ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే దీని ప్రారంభ ధర రూ.5లక్షల వరకే ఉండొచ్చని తెలుస్తోంది. ఈ కొత్త మోడల్ క్విడ్‌ గతంలో కంటే ఆకర్షణీయమైన డిజైన్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అప్‌డేటెడ్ ఇంటీరియర్ వంటి ఫీచర్లతో రాబోతుంది. కానీ ఇంజన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయడం లేదు. ఓల్డ్‌ మోడల్‌తో పోల్చుకుంటే ఈ కారులో ఛాలా ఛేంజెస్ చేసినట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం రాబోతున్న ఈ కొత్త రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్ ఫ్రంట్ డిజైన్ మొత్తం సరికొత్త లుక్‌తో రానుంది. ఇందులో కొత్త గ్రిల్, అప్‌డేటెడ్ బంపర్, Y-షేప్ LED DRLలతో కూడిన కొత్త హెడ్‌ల్యాంప్‌లు కూడా ఉండే ఛాన్స్ ఉంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా కొత్త డిజైన్ టెయిల్ లైట్లు, బంపర్‌ను సెట్ చేశారు. SUV స్టైల్, కాంపాక్ట్ సైజులో ఉండే ఈ కారు సిటీ డ్రైవింగ్‌కు చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఈ కొత్త క్విడ్‌లో లోపల డిస్‌ప్లేతో పాటు పూర్తి ఇంటీరియన్‌ను ఛేంజ్ చేసినట్టు తెలుస్తోంది. ఆటో పండిట్ నివేదిక ప్రకారం: ఇందులో సుమారు 10 ఇంచెస్ బిగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అలాగే పాటు Android Auto, Apple CarPlay సపోర్ట్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, పవర్ విండోస్, కొత్త డాష్‌బోర్డ్ డిజైన్, ప్రీమియం సీట్ ఫ్యాబ్రిక్ వంటి ఫీచర్లు కూడా తీసుకురావోచ్చు. ఈ కొత్త క్విడ్‌ ఇంజన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌లో ప్రస్తుతం ఉన్న 1.0-లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌నే కొనసాగిస్తారు. ఇందులో 5 స్పీడ్ మ్యానువ్, ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ ఉంటుంది. ఈ ఇంజిన్ దాదాపు 68 హార్స్‌పవర్‌తో పాటు 22 కిలో మీటర్ల వరకు మైలేజ్‌ను కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త క్విడ్‌లో సేఫ్టీ ఫీచర్స్ చూసుకుంటే ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABSతో కూడిన EBD, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఇతర అవసరమైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇక దీని ధర విషయానికి వస్తే.. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 4.80 లక్షల నుండి రూ. 5.50 లక్షల మధ్య ఉండవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu