Ad Code

త్వరలో 'రెడ్‌మి నోట్ 17' విడుదల

రెడ్‌మి నోట్ 17 త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ అందించిన లీకుల ప్రకారం ఈ సిరీస్‌లోని ఒక మోడల్‌లో 9,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించబోతున్నారు. ఈ కొత్త రెడ్‌మీ నోట్ 17 ఫోన్ కేవలం బ్యాటరీ పరంగానే కాకుండా మిగతా ఫీచర్లలోనూ అదరగొట్టనుందని సమాచారం. దీనిలో ఫ్లాట్ 1.5K రెజల్యూషన్ డిస్‌ప్లేను అందించనున్నారు. తద్వారా వీడియోలు చూసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో పాటు ఎక్కువ వాల్యూమ్ అవుట్‌పుట్ ఇచ్చేలా ట్యూన్ చేసిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను ఇందులో అమర్చనున్నారు. ఫోన్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. స్నాప్‌డ్రాగన్ 6-సిరీస్ చిప్‌సెట్‌ను వాడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్ కావచ్చు. ఈ కొత్త చిప్‌సెట్‌తో వచ్చే మొదటి స్మార్ట్‌ఫోన్లలో రెడ్‌మీ కూడా ఒకటని క్వాల్‌కామ్ ఇప్పటికే స్పష్టం చేసింది. అందువల్ల రోజువారీ వాడకంతో పాటు మల్టీటాస్కింగ్ కూడా ఈ ఫోన్‌ చాలా స్మూత్‌గా సాగుతుంది. సాధారణంగా పెద్ద బ్యాటరీ ఫోన్లు పడిపోతే దెబ్బతినే అవకాశం ఎక్కువ. అందుకే షావోమి ఈసారి మన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఫ్లాగ్‌షిప్ ఫోన్ల తరహాలో దీనికి వాటర్ రెసిస్టెన్స్ (నీటి నుంచి రక్షణ) ఫీచర్‌ను ఇవ్వబోతున్నారు. అలాగే ఫోన్ కింద పడినా త్వరగా స్క్రీన్ పగలకుండా ఉండేలా డ్రాప్ ప్రొటెక్షన్‌ను మరింత మెరుగుపరిచినట్లు సమాచారం.

Post a Comment

0 Comments

Close Menu