Ad Code

దర్శకుడు, నటుడు కె.భాగ్యరాజ్ హఠాన్మరణం

ర్శకుడు, నటుడు కె.భాగ్యరాజ్ (73) హఠాన్మరణం అటు తమిళ ఇండస్ట్రీతో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ తీవ్ర విషాదం నింపింది. ఆయన ఇక లేరన్న వార్తను ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. శనివారం ఉదయం ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. విషాద సమయంలో ఆయన చివరిసారిగా కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ నటి, పొలిటీషియన్ ఖుష్బూ కుమార్తె అవంతిక వివాహ వేడుక జూన్ 25 (గురువారం) గోవాలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తమిళ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్ ప్రముఖులు మెగాస్టార్‌తో పాటు వెంకటేశ్ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకకు భాగ్యరాజ్ కూడా తన ఫ్యామిలీతో కలిసి వచ్చారు. పట్టు చొక్కా, పట్టు థోవతి ధరించి ట్రెడిషనల్ లుక్‌లో సందడి చేశారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ నూతన జంటను ఆశీర్వదించారు. వేదికపైకి వస్తున్న భాగ్యరాజ్‌కు మెగాస్టార్ చేయి అందించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. రెండు రోజుల క్రితం సంతోషంగా, ఆరోగ్యంతో పెళ్లి వేడుకలో తిరిగిన ఆయన ఇక లేరన్న వార్తను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు ఈ వీడియోను చూసి ఎమోషనల్ అవుతున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu