విష వాయువు పీల్చి ముగ్గురు కార్మికులు దుర్మరణం

ఢిల్లీలోని ముండ్కా పారిశ్రామిక ప్రాంతంలోని ఫ్యాక్టరీ నెంబర్ 93/8లో విష వాయువులు పీల్చి ముగ్గురు కార్మికులు మరణించారు. పరిశ్రమలోని ఒక సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు ఒక కార్మికుడు లోపలికి దిగాడు. అక్కడ విష వాయువు పీల్చడం వల్ల కొద్దిసేపటికే అతడు స్పృహ తప్పి పడిపోయాడు. అతడిని కాపాడేందుకు మరో ఇద్దరు కార్మికులు కూడా ఒకరి తర్వాత మరొకరు లోపలికి దిగారు. అప్రమత్తమైన ఇతర కార్మికులు వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది లోపలికి దిగి ముగ్గురిని బయటకు తీశారు. ఆసుపత్రికి తరలించగా ముగ్గురు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతులను అరుణ్‌ (38), సందీప్ (32), చంద్ (42)గా గుర్తించారు. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org