Ad Code

రామమందిర విరాళాల వివాదం : బాబ్రీ మసీదు విరాళాలపై ఎందుకు మాట్లాడటం లేదు

త్తరప్రదేశ్ లోని మిర్జాపూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ మాట్లాడుతూ రామమందిర నిధుల గురించి ప్రశ్నిస్తున్న వారు, గతంలో బాబ్రీ మసీదు నిర్మాణం కోసం సేకరించిన విరాళాల విధివిధానాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు. రామమందిర విరాళాల చుట్టూ జరుగుతున్న ప్రచారమంతా ప్రతిపక్షాల కుట్రలో భాగమేనని మండిపడ్డారు. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు కేవలం ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే సనాతన ధర్మాన్ని, రామమందిరాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయని బ్రజేష్ పాఠక్ ఆరోపించారు. “ఒకప్పుడు బాబ్రీ మసీదు కోసం కూడా పెద్ద ఎత్తున విరాళాలు వసూలు చేశారు. ఆ నిధులు ఏమయ్యాయో, ఎక్కడికి వెళ్లాయో ఎవరూ ప్రశ్నించరు. ప్రతిపక్షాలు కేవలం ఓట్ల బుజ్జగింపు రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తాయి” అని డెప్యూటీ సీఎం దుయ్యబట్టారు. ఈ విషయంలో విపక్ష నేతలను నిలదీయాలని ఆయన మీడియాకు సూచించారు. రామమందిర నిధుల దుర్వినియోగంపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం  విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో భాగంగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయోధ్య పోలీసులు గురువారం ఎనిమిది మందితో పాటు మరికొందరిపై దొంగతనం, నేరపూరిత నమ్మకద్రోహం, కుట్రపూరిత చర్యల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైన మరుసటి రోజే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో అవినీతికి తావులేదని స్పష్టం చేశారు. ఈ నిధుల అవకతవకల కేసులో పోలీసులు చట్టప్రకారం, నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులకు శిక్ష పడేలా చూస్తారని బ్రజేష్ పాఠక్ భరోసా ఇచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu