Ad Code

కావ్య మారన్-అనిరుధ్ పెళ్లి ఫిక్స్? : సోషల్ మీడియాలో హల్‌చల్

న్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ రిలేషన్‌లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కావ్య, అనిరుధ్ పెళ్లి ఫిక్స్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని అనిరుధ్‌ బంధువు, సీనియర్ నటుడు వై.జీ. మహేంద్రన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 'అనిరుధ్ మృదు స్వభావి. నాకు తెలిసినంత వరకు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ అమ్మాయి సాధారణ వ్యక్తి కాదు. అంత పెద్ద టీమ్ ను నిర్వహించగల సామర్థ్యం ఆమెకు ఉంది. తండ్రి వ్యాపార నైపుణ్యాలు ఆమెకు వచ్చాయి. ఇద్దరూ మంచి జోడీ. కలిసి మ్యూజిక్ బిజినెస్‌లో కూడా రాణించగలరు' అని ఆయన పేర్కొన్నారు. మహేంద్రన్ చేసిన ఈ వ్యాఖ్యలతో కావ్య-అనిరుధ్ పెళ్లి టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అయితే గతంలో ఈ వార్తలను అనిరుధ్ ఖండించిన సంగతి తెలిసిందే. 

Post a Comment

0 Comments

Close Menu