Ad Code

కారులో బాంబు పేలి వ్యక్తి సజీవ దహనం : కత్తి దాడిలో గాయపడిన యువతి

ర్ణాటకలో కారులో బాంబు పేలడంతో 30 ఏళ్ల యువకుడు సజీవ దహనమైయ్యాడు. పేలుడుకు మునుపు ఆ యువకుడు తనతోపాటు వచ్చిన యువతిపై కత్తితో దాడి చేశాడు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, నాగేంద్ర అనే వ్యక్తి అద్దె కారులో రమ్యా ఉల్లాస్ అనే యువతితో కలిసి బెంగళూరు నుంచి బయలుదేరాడు. అంకోలా వైపు వెళుతుండగా వారి మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో నాగేంద్ర రమ్యను కత్తితో పొడిచాడు. నాగేంద్ర వద్ద బాంబు కూడా ఉందని రమ్య కారు డ్రైవర్ ప్రవీణ్‌ను హెచ్చరించడంతో అతడు కారును రోడ్డుపక్కన నిలిపి దిగిపోయాడు. ఈ క్రమంలో కారు పేలడంతో మంటలు చెలరేగి నాగేంద్ర సజీవదహనమయ్యాడు. ఈ ఘటనలో డ్రైవర్ ప్రవీణ్ కూడా గాయపడ్డాడు. కత్తి దాడితో గాయపడ్డ యువతి స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. తన వెంట తెచ్చుకున్న బాంబును నాగేంద్ర కారులోనే డిటోనేట్ చేయడంతో మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment

0 Comments

Close Menu