Ad Code

జర్మనీలో మాస్ షూటింగ్ : ఐదుగురి మృతి

ర్మనీలోని స్టేడ్ పట్టణంలో సోమవారం జరిగిన మాస్ షూటింగ్‌లో ఐదుగురు మరణించారు. కాల్పుల ఘటనతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పులతో సంబంధమున్న ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మాస్ షూటింగ్‌కు కారణాలపై ఈ ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. స్టేడ్ పట్టణంలోని యువ కేంద్రం సమీపంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. సిటీ మధ్యలో ఉండే ఈ ప్రాంతంలో ఈమధ్య పెద్ద సంఖ్యలో కార్యకలాపాలు సాగుతున్నాయి. దాంతో, తుపాకులతో వచ్చిన కొందరు అక్కడి వారిపై కాల్పులు జరిపారు. ఒక్కసారిగా కాల్పుల మోతతో జనాలు భయభ్రాంతులకు లోనయ్యారు. బుల్లెట్ గాయాలతో ఐదుగురు చనిపోయారని ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్‌ వార్త సంస్థతో ఓ పోలీసు అధికారి చెప్పారు. సమాచారం అందగానే అక్కడి వెళ్లిన పోలీసులు.. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారని ఆయన తెలిపారు. ఈ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయండి. మీ ప్రాణాలు కాపాడుకోండి అని అక్కడి వారిని ఆదేశించినట్టు పోలీస్ అధికారి వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu