Ad Code

ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక రోగిని చెప్పుతో కొట్టి, కాలితో తన్నిన మహిళా సిబ్బంది : సోషల్ మీడియాలో వీడియో వైరల్

త్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఒక యువకుడిపై ఆసుపత్రికి చెందిన మహిళా సిబ్బంది క్రూరంగా దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ప్రజాగ్రహాన్ని రేకెత్తించడమే కాకుండా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల భద్రత, సిబ్బంది ప్రవర్తనపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం మానసిక స్థితి సరిగ్గా లేని ఒక యువకుడు ఆసుపత్రి ఆవరణలో నేలపై పడి ఉన్నాడు. అక్కడికి వచ్చిన ఒక మహిళా సిబ్బంది అతడిని ఆసుపత్రి నుంచి బయటకు పంపే క్రమంలో అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. మొదట బూతులు తిడుతూ, ఆ తర్వాత ఆ యువకుడి తలపైనా, ముఖంపైనా పదేపదే కాలితో తవ్వింది. అంతటితో ఆగకుండా చేతిలోకి చెప్పు తీసుకుని అతడిని దారుణంగా కొట్టింది. ఈ దారుణం జరుగుతున్నంత సేపు పక్కనే ఉన్న ఒక సెక్యూరిటీ గార్డు ఆమెను వారించాల్సింది పోయి, మూగ ప్రేక్షకునిలా నిలబడి చూడటం అక్కడి భద్రతా వైఫల్యానికి అద్దం పడుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సదరు ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి బ్రజేష్ పాఠక్ తీవ్రంగా స్పందించారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు రాయ్‌బరేలీ జిల్లా ఆసుపత్రి సీఎంఎస్ డాక్టర్ పుష్పేంద్ర కుమార్ తక్షణ చర్యలు చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా వార్డ్ గర్ల్‌ను విధుల్లోంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Post a Comment

0 Comments

Close Menu