హైదరాబాద్ లోని ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని బోలక్ పూర్ లో ఆడుకుంటూ రోడ్డు దాటుతున్న శ్రీహన్స్(4) అనే బాలుడ్ని మినీ వ్యాన్ లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా ముందు టైర్లు చిన్నారి మీదకు వెళ్లాయి. దాంతో టైర్ల కింద నలిగిపోయి చిన్నారి మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.ఈ ఘటనతో మినీ వ్యాన్ డైవర్ పరిగెత్తే క్రమంలో ఓ వ్యక్తి అతనిపై దాడి చేసి వెంబడించాడు. ఎట్టకేలకు డ్రైవర్ ను పట్టుకుని దేహశుద్ధి చేసిన కాలనీవాసులు పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. బాలుడి మృతిని తట్టుకోలేక కన్నీరుమున్నీరుగా తల్లిదండ్రులు విలపిస్తున్నారు. మరోవైపు తమకు న్యాయం చేయాలని బంధువులు ఆందోళన చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
0 Comments