విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మృతి కేసులో నిందితులుగా ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ హెడ్‌కానిస్టేబుళ్లు బి. అశోక్ బాబు, పి. నాని సోమవారం సూర్యారావుపేట ఏసీపీ కార్యాలయానికి వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయారు. సాయికృష్ణ మృతి వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక మాజీ సీఐ ఎం.వి. నాగరాజుకు వీరిద్దరూ పూర్తి స్థాయిలో సహకరించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. ఈ క్రమంలోనే సీఐ నాగరాజును పోలీసులు అరెస్టు చేసినప్పటి నుంచి ఈ ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులు వీరి కోసం ముమ్మరంగా గాలిస్తున్న నేపథ్యంలో, ఎట్టకేలకు అశోక్, నాని ఇద్దరూ స్వయంగా వచ్చి లొంగిపోవాల్సి వచ్చింది. వీరి లొంగుబాటుతో ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుందని, సాయికృష్ణ మృతి వెనుక ఉన్న మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
0 Comments