నితిన్ నబిన్ ది బీహార్ మైండ్ సెట్ : తెలంగాణపై ఎలాంటి అవగాహన లేదు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు దేశ రాజకీయాలపై పట్టు లేన్నట్లు కనిపిస్తోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇన్‌పుట్స్ ఇచ్చిన వారు కూడా నితిన్ నబిన్‌కు సరిగా ఇవ్వలేదు అనుకుంటా.. నితిన్ నబిన్‌కు తెలంగాణలో గత పాలకుల పరిపాలన గురించి తెలుసుకోలేదన్నారు. గతంలో బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకులు కాళేశ్వరం గురించి ఎం మాట్లాడారో తెలుసుకోవాలన్నారు. నితిన్ నబిన్ ది బీహార్ మైండ్ సెట్. దేశంలోని అన్ని రాష్ట్రాలలోని పరిస్థితులు తెలుసుకొని పర్యటనలు చేయాలని సూచించారు. బీజేపీ.. బీఆర్ఎస్‌కు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని చెప్పారు. ఇప్పుడు నితిన్ నబిన్ వచ్చి అవినీతి జరుగకుండా చూస్తామని అంటున్నారు.. 12 ఏళ్లుగా మీరే దేశంలో అధికారంలో ఉన్నారు. మీ నేతలందరికి తెలుసు.. ఎవరు కాళేశ్వరంలో అవినీతి చేశారో, సీబీఐకి ఇస్తే 48 గంటల్లోఅవినీతి చేసిన వారికి బుద్ది చెప్తామని అన్నారు.. కానీ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి ఇవ్వాలని లేఖ రాసినా ఇప్పటివరకూ సీబీఐకి మీరు కేసు అప్పగించలేదని దుయ్యబట్టారు. తెలంగాణ ఇచ్చింది యూపీఐ చైర్మపర్సన్‌గా సోనియా గాంధీ.. మరి సోనియా గాంధీది ఇండియన్ మైండ్ సెట్టో, కాదో నితిన్ నబిన్ చెప్పాలన్నారు. దేశ ప్రజలకు ఏం కావాలో సోనియా గాంధీకి తెలుసన్నారు. బీజేపీ జాతీయ మేనిఫెస్టో-2014లో ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని మోదీ చెప్పారో చూడండి.. మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి నితిన్ నబిన్.. మీ బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేది లేదు.. మీకు ఏజండానే లేదన్నారు. మీ బీజేపీ నేతలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని గెలువాల్సిందేనన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయి తెలుసుకోండి.. అలాగే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని వచ్చాయో చెక్ చేసుకోండి.. జాతీయ అధ్యక్షుడిగా మీరు ఇవన్నీ తెలుసుకోవాలి.. ఫిక్సింగ్ గేమ్ గురించి తెలుసుకోండని సూచించారు.

Post a Comment

0 Comments