ఫిలిప్పీన్స్‌లో మరో భారీ భూకంపం : రిక్టరు స్కేలుపై 6.5గా నమోదు

క్షిణ ఫిలిప్పీన్స్‌లోని మిందనౌ ప్రాంతాన్ని శుక్రవారం మరో భారీ భూకంపం వణికించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 6.5గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 29 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. తీవ్రమైన భూప్రకంపనల నేపథ్యంలో తీరప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సునామీ ముప్పును నివారించేందుకు తక్షణమే సురక్షితమైన ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఈ ఘటనకు సంబంధించిన ఆస్తి, ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, కొన్ని వారాల క్రితమే ఇక్కడ సంభవించిన మరో భూకంపంలో 80 మందికి పైగా మృతి చెందడం గమనార్హం.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం