Ad Code

రూ.10లకు చెరువులో కోడిగుడ్డు ధరలు

కోడిగుడ్డు ధరలు గత మూడు నెలల్లో వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో ఒక్క గుడ్డు రూ.8 వరకు విక్రయమవుతోంది. మార్కెట్ పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలో ఒక్క గుడ్డు ధర రూ.10కు చేరే అవకాశముందని పౌల్ట్రీ రంగ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. రిటైల్ మార్కెట్‌లో ఏప్రిల్‌లో గుడ్డు ధర సుమారు రూ.4 ఉండగా, మే నెలలో రూ.5కు చేరింది. జూన్ తొలి వారంలో రూ.6కు పెరిగిన ధర, నెలాఖరుకు రూ.8 వరకు చేరింది. రెండు వారాల క్రితం రూ.6 నుంచి రూ.6.50 మధ్య విక్రయమైన గుడ్డు ప్రస్తుతం రూ.7.50 నుంచి రూ.8 వరకు అమ్ముడవుతోంది. దీంతో రోజువారీ ఆహారంలో గుడ్డును తప్పనిసరిగా తీసుకునే కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. తెలంగాణలో సుమారు 4 వేల లేయర్ పౌల్ట్రీ ఫారాలు ఉండగా, సాధారణంగా రోజుకు 4 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. వీటిలో సగం రాష్ట్రంలోనే వినియోగం కాగా, మిగిలిన సగం ఇతర రాష్ట్రాలకు సరఫరా అవుతోంది. అయితే ఈ ఏడాది తీవ్ర వేసవి ప్రభావంతో దాదాపు 10 శాతం కోళ్లు చనిపోవడం వల్ల ఉత్పత్తి తగ్గింది. ఫలితంగా మార్కెట్‌లో డిమాండ్‌కు తగిన సరఫరా లేక ధరలు పెరిగాయి. దాణా, ఔషధాల ధరలు గణనీయంగా పెరగడం కూడా గుడ్డు ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపింది. నేషనల్ ఉత్తర తెలంగాణ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు మాట్లాడుతూ, రైతు వద్ద ఒక్క గుడ్డు ధర సుమారు రూ.6 ఉండగా, రిటైల్ మార్కెట్‌లో అది రూ.8కు చేరుతోందన్నారు. ఒక గుడ్డు ఉత్పత్తి చేయడానికి మేత, మందుల ఖర్చు కలిపి దాదాపు రూ.7 వరకు అవుతోందని చెప్పారు. గతంలో పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఎగుమతులు తగ్గి పౌల్ట్రీ రైతులు భారీ నష్టాలు చవిచూశారని, ప్రస్తుతం ధరలు పెరగడం వల్ల ఆ నష్టాల నుంచి కొంత మేర కోలుకునే అవకాశం ఉందని వివరించారు.

Post a Comment

0 Comments

Close Menu