హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇథియోపియా నుంచి క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తున్న ఓ బాలిక మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. విమాన ప్రయాణ సమయంలో బాలిక ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో విమాన సిబ్బంది అత్యవసర వైద్య సహాయం అందించేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు విమానం ల్యాండైన వెంటనే బాలికను శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో విమానాశ్రయంలో విషాద వాతావరణం నెలకొంది. చిన్నారి తల్లిదండ్రుల రోదనలు ఎయిర్‌పోర్టు ఆవరణలోని ప్రయాణికుల హృదయాలను కలిచివేశాయి. బాలిక మృతికి గల కచ్చితమైన కారణాలపై వైద్యులు, సంబంధిత అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.
0 Comments