జులై 1 నుంచి బ్యాంకింగ్, రవాణా, పన్నుల రంగాల్లో కీలక మార్పులు

జులై 1 నుంచి దేశంలో బ్యాంకింగ్, రవాణా, పన్నుల రంగానికి సంబంధించి పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ప్రముఖ డిజిటల్ చెల్లింపుల యాప్ ఫోన్ పే ద్వారా జారీ చేసే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్ల విధానంలో కీలక మార్పులు రానున్నాయి. ఇకపై ఈ కార్డులపై లభించే రివార్డ్ పాయింట్లపై కొత్త పరిమితులు (క్యాపింగ్) వర్తిస్తాయి. దీనివల్ల కార్డుదారులు పొందే ప్రయోజనాల్లో మార్పు రానుంది. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుదారులు ఉచిత ఎయిర్‌పోర్ట్ లాంజ్ సదుపాయాన్ని పొందాలంటే కొత్త నిబంధనను పాటించాల్సి ఉంటుంది. ఒక క్వార్టర్ (త్రైమాసికం)లో 3 ఉచిత డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ విజిట్స్ పొందాలనుకుంటే, దానికి ముందు క్వార్టర్‌లో సదరు కార్డుపై కనీసం రూ.60,000 ఖర్చు చేసి ఉండాలి. ఈ ఖర్చు పరిమితిని రీచ్ అయితేనే తర్వాతి త్రైమాసికంలో ఉచిత లాంజ్ సదుపాయం లభిస్తుంది. పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కూడా ఈ మార్పుల వల్ల అదనపు భారం పడనుంది. వివిధ కేటగిరీల పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫీజులను ప్రభుత్వం సవరించింది. జులై 1 నుంచి కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు పెంచిన ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఆధార్ వినియోగదారులకు ఒక ఉపశమనం లభించనుంది. ఆధార్ మొబైల్ యాప్ ద్వారా తమ ప్రొఫైల్‌లో ఈ-మెయిల్ ఐడీని అప్‌డేట్ లేదా మార్పులు చేసుకునే సదుపాయాన్ని ఉచితంగా కల్పించారు. దీనికోసం ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org