ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం జమేదారిపుట్టుగ సమీప జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. మద్యం మత్తులో లారీని నడుపుతున్న డ్రైవర్ అదుపుతప్పి, ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇచ్చాపురం ఎఎస్‌పేటకు చెందిన మద్దిలి తరిణమ్మ , గుజ్జిపుట్టుగకు చెందిన మురపాల పార్వతి , రాపాకపుట్టుగకు చెందిన నర్తు పద్మమ్మ మృతి చెందారు. గాయపడిన ఆటో డ్రైవర్‌తో పాటు మరో నలుగురిని ఇచ్చాపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం తాగి లారీని అతి వేగంగా నడపటం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది.
0 Comments