హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతం ఉర్మాన్ గ్రామ శివారులో శనివారం తెల్లవారుజామున మినీ వ్యాన్ అదుపుతప్పి లోయలో పడి ఆరుగురు మృతి చెందారు. స్థానికులు, రెస్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. లోయలో నుంచి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. పాల వ్యాన్ రామ్ పూర్ నుంచి టెక్లెక్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొండ ప్రాంతం కావడంతో మూలమలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. మృతులు అభిషేక్ సాని (23), లాయక్ రామ్ (56), నితిన్ (23), అశోక్ జైన్ (23), ఆశా కుమారి, ఆమె కుమారుడుగా గుర్తించారు.
0 Comments