Ad Code

జులై 1 నుంచి పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫీజులపెంపు

జులై 1 నుంచి పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫీజులను విదేశాంగ మంత్రిత్వ శాఖ పెంచింది. పాస్‌పోర్ట్ యాక్ట్ 1967 లోని సెక్షన్ 24 ప్రకారం అధికారాలను ఉపయోగించి పాస్‌పోర్ట్ రూల్స్ 1980 లో సవరణలు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కొత్త మార్పుల ప్రకారం 18 ఏళ్లు పైబడిన వారు, అలాగే 15 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న వారు ఈ కేటగిరీలో దరఖాస్తు చేస్తే 36 పేజీల పాస్‌పోర్ట్‌కు సాధారణ రుసుము 2500 రూపాయలు. తత్కాల్ కేటగిరీలో రుసుము 5000 రూపాయలు. 60 పేజీల పాస్‌పోర్ట్‌కు సాధారణ దరఖాస్తులో 3500 రూపాయలు. తత్కాల్ దరఖాస్తులో 6000 రూపాయలు. ఇప్పటివరకు ఉన్న ఛార్జీలు చూస్తే 36 పేజీల పాస్‌పోర్ట్‌కు 10 సంవత్సరాల చెల్లుబాటుతో సాధారణ రుసుము 1500 రూపాయలు ఉండేది. తత్కాల్ అదనపు రుసుము 2000 రూపాయలు ఉండేది. 60 పేజీల పాస్‌పోర్ట్‌కు సాధారణ రుసుము 200 రూపాయలు, తత్కాల్ అదనపు రుసుము 2000 రూపాయలు. 18 ఏళ్లలోపు మైనర్లకు 5 సంవత్సరాలు లేదా 18 ఏళ్లు వచ్చే వరకు చెల్లుబాటు ఉన్న 36 పేజీల పాస్‌పోర్ట్‌కు ఫీజు 1000 రూపాయలు, తత్కాల్ 2000 రూపాయలు. పోయిన పేజీ లేదా దెబ్బతిన్న లేదా దొంగతనానికి గురైన పాస్‌పోర్ట్ రీప్లేస్‌మెంట్‌లో 36లకు 3000 రూపాయలు, 60లకు 3500 రూపాయలు ఉంటాయి. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ అంటే PCC కోసం 500 రూపాయలు వసూలు చేస్తారు. ECR తొలగింపు లేదా వ్యక్తిగత వివరాల మార్పు కోసం కూడా ఫీజులు ఉన్నాయి. మైనర్లకు కూడా ఇలాంటి మార్పుల కోసం 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు ఫీజు ఉంటుంది. ఇదే సమయంలో పాస్‌పోర్ట్ గురించి మరో ముఖ్యమైన స్పష్టత కూడా వచ్చింది. పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రసారానికి భారత పాస్‌పోర్ట్ మాత్రమే పౌరసత్వానికి పూర్తి రుజువు కాదన్న వ్యాఖ్యతో పెద్ద చర్చ మొదలైంది. సాధారణంగా పాస్‌పోర్ట్ భారత పౌరులకే ఇస్తారు కాబట్టి ఇది పౌరసత్వానికి ఆధారం అనుకుంటారు. కానీ ప్రభుత్వం మాటతో ఈ విషయంపై గందరగోళం ఏర్పడింది. ఈ చర్చలో చాలా మంది ప్రశ్నించారు. పాస్‌పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ వంటి పత్రాలు ఉన్నా కూడా అవి పౌరసత్వానికి చివరి రుజువులు కావని ఎందుకు అంటున్నారు. దీనికి కారణం రెండు చట్టాలు ఉండటమే. ఒకటి పాస్‌పోర్ట్ యాక్ట్ 1967, మరొకటి సిటిజన్‌షిప్ యాక్ట్ 1955. పాస్‌పోర్ట్ యాక్ట్ ప్రయాణ పత్రాల జారీ, నియమాలు, దేశం విడిచి వెళ్లే విధానాలను నియంత్రిస్తుంది. సెక్షన్ 3 ప్రకారం చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ లేకుండా దేశం విడిచి వెళ్లడం సాధ్యం కాదు. ఈ చట్టం పాస్‌పోర్ట్ రకాలు, దరఖాస్తు విధానం, తిరస్కరణ కారణాలు, రద్దు చేసే పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. అలాగే పాస్‌పోర్ట్ కేంద్ర ప్రభుత్వ ఆస్తిగా ఉంటుందని కూడా చెబుతుంది. అయితే ఎవరు భారత పౌరుడు అవుతారు అనే విషయాన్ని ఈ చట్టం నిర్ణయించింది. సాధారణంగా పాస్‌పోర్ట్ భారత పౌరులకే ఇస్తారు. సెక్షన్ 6(2)(ఎ) ప్రకారం దరఖాస్తుదారు భారత పౌరుడు కాకపోతే పాస్‌పోర్ట్ ఇవ్వకూడదు. సెక్షన్ 12 ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చి పాస్‌పోర్ట్ పొందితే అది నేరంగా పరిగణిస్తారు. సరళంగా చెప్పాలంటే పౌరసత్వం ఉంటేనే పాస్‌పోర్ట్ ఇస్తారు. కానీ పాస్‌పోర్ట్ కూడా పౌరసత్వాన్ని తుది స్థాయిలో నిర్ధారించే పత్రం కాదు. అది ప్రయాణం కోసం ఇచ్చే అధికారిక గుర్తింపు మాత్రమే. 

Post a Comment

0 Comments

Close Menu