నువ్వుల పాలు - ఆరోగ్య ప్రయోజనాలు

Friday, April 24, 2026

arogyam bones and teeth as strong as steel From calcium to iron health it contains virtually every essential nutrient Sesame Milk – Health Benefits

t f B! P L


నువ్వులతో తయారు చేసే నువ్వుల పాలు ఒక అద్భుతమైన సూపర్‌ ఫుడ్. క్యాల్షియం నుండి ఐరన్ వరకు ఇందులో లేని పోషకం లేదు. నువ్వుల పాలలో క్యాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకలు, పళ్ళు ఉక్కులా బలంగా ఉండటానికి సహాయపడతాయి. ముఖ్యంగా పాలు పడని వారు లేదా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇవి ఒక గొప్ప వరం. ఇక దీనితో పాటు ఇందులో ఉండే మాగ్నీషియం నరాలు, కండరాలు సరిగ్గా పనిచేసేలా చూస్తుంది. చాలామంది మహిళలు రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. నువ్వుల పాలలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో రక్తం పెరగడానికి ఇవి బాగా తోడ్పడతాయి. అలాగే ఇందులో ఉండే ప్రోటీన్లు కండరాల పెరుగుదలకు, శరీరంలో దెబ్బతిన్న కణాలను రిపేర్ చేయడానికి సహాయపడతాయి. ఇక నీరసంగా ఉండేవారికి ఇవి తక్షణ శక్తినిస్తాయి. నువ్వుల పాలలో ‘హెల్తీ ఫ్యాట్స్’ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మన రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఇందులోని ఫైబర్ (పీచు పదార్థం) వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇక చర్మం కాంతివంతంగా మెరవడానికి, జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా ఈ పాలు ఎంతో మేలు చేస్తాయి. హార్మోన్ల సమస్యలతో బాధపడేవారికి, ముఖ్యంగా మహిళల్లో హార్మోనల్ బ్యాలెన్స్‌కు నువ్వుల పాలు సహకరిస్తాయి. అయితే, వీటిని తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం. నువ్వులలో క్యాలరీలు ఎక్కువ కాబట్టి మోతాదు మించకూడదు. అలాగే ఇక నువ్వుల వల్ల అలర్జీ వచ్చే వారు వీటిని తాగేముందు జాగ్రత్తగా ఉండాలి.


Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ