Ad Code

'వెస్పా టెక్ 80' స్పెషల్ ఎడిషన్‌ను ఆవిష్కరణ


దేశీయ మార్కెట్లో వెస్పా 80వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభసందర్భంగా, వాహన ప్రియుల కోసం అత్యంత ఖరీదైన, అరుదైన 'వెస్పా టెక్ 80'  స్పెషల్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. ఈ స్కూటర్‌ను కేవలం 80 యూనిట్లలో మాత్రమే విడుదల చేయనున్నట్లు సమాచారం. పాతకాలపు అందాన్ని , నేటి తరం సాంకేతికతతో మేళవించి రూపొందించిన ఈ స్కూటర్ ఇప్పుడు టూ వీలర్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. వెస్పా ప్రయాణం ప్రారంభమై 80 ఏళ్లు గడిచినందుకు గుర్తుగా రూపొందించిన ఈ 'టెక్ 80' ఎడిషన్ సాదాసీదా స్కూటర్ కాదు. ఇది ఒక కలెక్టబుల్ మాస్టర్ పీస్. ఈ స్కూటర్‌ను వెస్పా కేవలం పరిమిత సంఖ్యలో  మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. దీని బాడీపై ప్రత్యేకంగా ముద్రించిన '80th Anniversary' బాడ్జింగ్ , విలక్షణమైన గ్రాఫిక్స్ దీనికి ఒక రాజసాన్ని అద్దాయి. క్లాసిక్ 'గ్లోసీ గ్రే' రంగులో మెరిసిపోతున్న ఈ స్కూటర్, చూసిన వెంటనే ఎవరినైనా కట్టిపడేసేలా ఉంది. దీనికి తోడు ప్రీమియం లెదర్ ఫినిషింగ్‌తో కూడిన సీటు రైడర్‌కు అత్యున్నత స్థాయి విలాసాన్ని అందిస్తుంది. లుక్స్ పరంగానే కాకుండా, టెక్నాలజీ విషయంలోనూ వెస్పా తన సత్తా చాటింది. ఈ స్పెషల్ ఎడిషన్‌లో ఫీచర్లు హైలైట్‌గా నిలుస్తున్నాయి. ఇందులో 4.3 అంగుళాల ఫుల్-కలర్ TFT డ్యాష్‌బోర్డ్‌ను అమర్చారు. ఇది చూడటానికి స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌లా ఉంటుంది. ఎంఐఏ సిస్టమ్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను స్కూటర్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల రైడింగ్‌లో ఉన్నప్పుడు కాల్స్, మెసేజ్ నోటిఫికేషన్లు, మ్యూజిక్ కంట్రోల్‌ను స్క్రీన్‌పైనే చూసుకోవచ్చు. టర్న్-బై-టర్న్ నావిగేషన్ సదుపాయం వల్ల దారి వెతుక్కోవడం ఇప్పుడు మరింత సులభం కానుంది. భద్రత విషయంలో రాజీ పడకుండా డ్యూయల్-ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్‌ను ఇందులో జోడించారు. ఇది జారుడు రోడ్లపై కూడా స్కూటర్ అదుపు తప్పకుండా కాపాడుతుంది. ఈ స్కూటర్ 155cc శక్తివంతమైన ఇంజిన్‌తో వస్తోంది. ఇది సిటీ ట్రాఫిక్‌లో వేగంగా దూసుకుపోవడమే కాకుండా, లాంగ్ డ్రైవ్స్‌లో కూడా అత్యంత సాఫీగా ఉండే రైడింగ్ అనుభూతిని ఇస్తుంది. వెస్పా బ్రాండ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా దీని ఇంజిన్ పెర్ఫార్మెన్స్ చాలా సైలెంట్‌గా , వైబ్రేషన్స్ లేకుండా ఉండటం విశేషం.

Post a Comment

0 Comments

Close Menu