తెలంగాణలోని జగిత్యాలలో మద్యం మత్తులో కానిస్టేబుల్ రచ్చ రచ్చ చేశారు. మహిళను ఢీకొట్టి దురుసుగా ప్రవర్తించాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పోలీస్ అనే బాధ్యత మరిచిన కానిస్టేబుల్ వెంకటేష్ హంగామా చేశాడు. శ్రీరామ థియేటర్ చౌరస్తా వద్ద స్కూటీపై వెళ్తున్న ఓ మహిళను, మద్యం మత్తులో అతివేగంగా వస్తూ తన ద్విచక్ర వాహనంతో ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే బాధ్యతగా స్పందించాల్సింది పోయి, “నేను కానిస్టేబుల్.. ఏం చేసుకుంటావో చేసుకో” అంటూ దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురై, కానిస్టేబుల్‌ను అక్కడికక్కడే నిలదీశారు. “పోలీసు అయితే నీకేమైనా ప్రత్యేక చట్టం ఉందా?”, “నీ బైక్ నెంబర్ ప్లేట్ ఎక్కడ?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. మద్యం సేవించి ఉన్న కానిస్టేబుల్ వెంకటేష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
3
Beranda
› Constable Venkatesh into custody
› Drunken Constable Hits Woman with Two-Wheeler
› Jagtial
› police immediately rushed to the site and transported the injured woman to a hospital
› telangana
› మద్యం మత్తులో మహిళను ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి కానిస్టేబుల్
Subscribe to:
Post Comments (Atom)