టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (86) ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. రాయిటర్స్ కథనం ప్రకారం ఆయన వయస్సు సంబంధిత కారణాలతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే రతన్ టాటా ఆరోగ్యంపై ఇప్పటి వరకు టాటా గ్రూప్స్ ఎటువంటి ప్రకటన చేయలేదు. రెండు రోజుల క్రితం ఆయనకు ఆరోగ్యం విషమించి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే దానిపై రతన్ టాటా ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన ఆరోగ్యంపై వస్తోన్న వదంతులను నమ్మవద్దని ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే తాజాగా వస్తున్న వార్తలపై ఆయన నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
0 Comments