టెక్సాస్‌లోని 'ది హిల్స్‌' మేయర్‌ పోటీలో బాపట్ల యువకుడు కార్తిక్‌ !


మెరికాలోని టెక్సాస్‌లో 'ది హిల్స్‌' మేయర్‌ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్తిక్‌ నరాలశెట్టి (35) పోటీపడుతున్నాడు. నవంబర్‌ 5న జరిగే ఎన్నికలో విజయం సాధిస్తే 'ది హిల్స్‌' మేయర్‌ పదవి చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా పేరుపొందనున్నాడు. బాపట్లకు చెందిన కార్తిక్‌ నరాలశెట్టి ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. న్యూజెర్సీలోని రట్జర్స్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో చేరగా కొంతకాలానికి చదువుకు దూరమయ్యాడు. అనంతరం సోషల్‌బ్లడ్‌ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి వ్యాపారవేత్తగా ఎదిగాడు. ప్రస్తుతం ఆ సంస్థ 21 దేశాల్లో సేవలను కొనసాగిస్తున్నట్లు కార్తిక్‌ చెప్పాడు. ఈ క్రమంలో తాను నివాసం ఉంటున్న 'ది హిల్స్‌' ఎన్నికలపై దృష్టి సారించాడు. నవంబర్‌ 5న జరిగే ఎన్నికల్లో పోటీకి దిగి ఆగస్టు నుంచే ప్రచారం మొదలుపెట్టాడు. స్థానికుల విశ్వాసాన్ని చూరగొని హిల్స్‌ శ్రేయస్సు కోసం పాటుపడతానని పేర్కొంటున్నాడు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org