లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. తన వద్ద పనిచేసిన మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నార్సింగి పోలీస్ స్టేషన్ లో సెప్టెంబర్ 15న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా జానీ మాస్టర్ ను పోలీసులు సెప్టెంబర్ 19న గోవాలో అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 20న హైద్రాబాద్ కు తీసుకు వచ్చారు. ఈ కేసులో పోలీసులు ఆయనను సెప్టెంబర్ లో నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించారు. జానీ మాస్టర్ వద్ద పనిచేసిన మహిళా కొరియోగ్రాఫర్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందే బాధితురాలు సినీ పరిశ్రమలోని పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలు విచారణ జరుపుతున్నారు.
0 Comments