తెలంగాణ సీఎంఆర్ఎఫ్ సహాయనిధి కి బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేష్ కుమార్, డీజీఎం ఎంవీఎస్ సుధాకర్ గురువారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ. కోటి విరాళం అందించింది. వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయల చెక్ ను విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. వరద బాధితుల సహాయం కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సినీ నటులు, పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా వరద బాధితుల సహాయార్థం తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.18.69 కోట్ల చెక్కును అందించారు. విద్యుత్ శాఖకు చెందిన 70,585 మంది ఉద్యోగులు, పెన్షనర్లు తమ ఒకరోజు వేతనం రూ.18.69 కోట్లను చెక్కు రూపంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఎస్పిడిసిఎల్ సిఎండి ముషారఫ్ అలీ, జెఎండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సినీ నటులు, పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు, ప్రభుత్వ శాఖల ఉద్యోగులు కూడా తమ విరాళాలను సీఎం సహాయ నిధికి అందజేస్తున్నారు. ప్రతి ప్రభుత్వ శాఖలోని ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించి, ఉమ్మడిగా విరాళం చెక్కును అందజేస్తారు.
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.కోటి విరాళం అందజేత !
by Telugu Lo Computer at October 24, 2024
Labels:
జనరల్ మేనేజర్ రితేష్ కుమార్
,
డీజీఎం ఎంవీఎస్ సుధాకర్
,
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.కోటి విరాళం అందజేత
,
పారిశ్రామిక వేత్తలు
,
ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు
,
సినీ నటులు
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment