విద్యుత్ చార్జీలు పెంచడం లేదు : మంత్రి గొట్టిపాటి రవి
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ చార్జీలు పెంచడం లేదని మంత్రి గొట్టిపాటి రవి వెల్లడించారు. కేవలం విద్యుత్ సర్దుబాటు చార్జిలు మాత్రమే వసూలు చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ చార్జీలు పెంచబోతున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని, అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. దమ్ముంటే ప్రతిపక్షాలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారారు. జగన్ హయాంలో ప్రజల ముక్కుపిండి విద్యుత్ చార్జీల వసూలు చేశారని విమర్శించారు. ఇప్పుడు విద్యుత్ చార్జి పెంపుపై మాట్లాడే హక్కు జగన్కు లేదన్నారు. గత టీడీపీ హయాంలో మిగులు విద్యుత్లో ఏపీ నెంబర్ వన్ గా ఉండేదని, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వనాశనం అయిందని మంత్రి గొట్టిపాటి విమర్శించారు.