35 కిలోల గంజాయి పట్టివేత !
తెలంగాణలోని భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ శివారులో మంగళవారం భువనగిరి రూరల్ పోలీసులు కారులో దాదాపుగా 35 కిలోల గంజాయి ఆంధ్రా నుండి హైదరాబాద్ కి తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని భువనగిరి రూరల్ ఎస్సై వి సంతోష్ కుమార్ తెలిపారు. మొత్తం నలుగురు నేరస్థులు కలిసి ముందు ఒక కారును, ఇద్దరు ఎస్కార్ట్ గా వాడి వెనుక కారులో ఇద్దరు గంజాయి తరలిస్తున్నారనీ పేర్కొన్నారు. నలుగురు నేరస్తులను, రెండు కార్లను, గంజాయిని, 3 ఫోన్లు సీజ్ చేసి అరెస్టు చేయడం జరిగిందనీ, పూర్తి వివరాలను ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలుపుతామని అన్నారు.