Ad Code

ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు !


పెట్రోల్ పంప్ డీలర్స్కు చెల్లించే డీలర్ కమీషన్ను పెంచుతున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఈరోజు నుంచే ఈ పెంచిన డీలర్ కమీషన్ అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 'ఎక్స్' వేదికగా ప్రకటించింది. ఈ ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి. ఈ మార్పు కారణంగా ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి. ఒక రాష్ట్రానికి, మరో రాష్ట్రానికి డీలర్ కమీషన్లో తేడా ఉంటుంది. ఒక రాష్ట్రంలో కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఈ డీలర్ కమీషన్ ఉంటుంది. అంతర్రాష్ట్ర సరుకు రవాణా హేతుబద్ధీకరణలో భాగంగా ఆయిల్ కంపెనీలు డీలర్ కమీషన్ పెంచడం గమనార్హం. ఛత్తీస్ ఘడ్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. మహారాష్ట్ర, జార్ఖండ్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈ రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. ఒడిశాలోని కూనన్పల్లిలో పెట్రోల్ ధర లీటర్పై అత్యధికంగా 4 రూపాయల 69 పైసలు, లీటర్ డీజిల్ పై రూ.4.45 పైసలు ధర తగ్గింది.

Post a Comment

0 Comments

Close Menu