దీపావళి పండుగను పురస్కరించుకొని సరయూ నది ఒడ్డున 28లక్షల దీపాలను వెలిగించారు. అయోధ్య భవ్య దీపోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. లేజర్, డ్రోన్ షోలు ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళా ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు కోసం దీపోత్సవంలో భాగంగా వెలిగించిన దీపాలను డ్రోన్ల సహాయంతో లెక్కిస్తున్నారు. అంతకుముందు రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి వేషధారులు కొలువు దీరిన రథాన్ని లాగారు. అయోధ్య ఆలయ ప్రాణ ప్రతిష్ట తర్వాత తొలి దీపావళి కావడం వల్ల దీపోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. సరయూ నది ఒడ్డున 28 లక్షల దీపాల్ని వెలిగించారు. ఈ కార్యక్రమం పలు గిన్నిస్ రికార్డులు నెలకొల్పనుంది. వేడుకల సందర్భంగా సుమారు 10 వేల మంది భద్రతా సిబ్బంది అయోధ్య రక్షణ బాధ్యతలు నిర్వహించారు. లేజర్, డ్రోన్ షోలు సహా మయన్మార్, నేపాల్, థాయ్‌లాండ్, మలేషియా, కంబోడియా, ఇండోనేసియా, భారతీయ కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
0 Comments