Ad Code

బ్లింకిట్‌లో రూ.2,999 కంటే ఎక్కువ కొనుగోలు చేసే వారికి ఈఎంఐ సదుపాయం !


జొమాటోకు చెందిన క్విక్‌కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ బ్లింకిట్‌ ఈఎంఐ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. నిర్దేశిత మొత్తానికి మించి చేసే కొనుగోళ్లకు ఈ సదుపాయం వర్తి్స్తుంది. బ్లింకిట్‌ సీఈఓ అల్బీందర్‌ దిండ్సా ఎక్స్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. బ్లింకిట్‌లో రూ.2,999 కంటే ఎక్కువ కొనుగోలు చేసే వారు ఈఎంఐ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని దిండ్సా పేర్కొన్నారు. బంగారం, వెండి కొనుగోళ్లకు ఇది వర్తించదని తెలిపారు. ఎంపిక చేసిన బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులు కలిగిన వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. తొలుత ఉత్పత్తులను కార్ట్‌లో యాడ్‌ చేశాక, చెక్‌ఔట్‌ సమయంలో ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. చెల్లింపు పూర్తయ్యాక ఆ మొత్తం ఈఎంఐగా బ్యాంక్‌ కన్వర్ట్‌ చేస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, సిటీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులు కలిగిన వారు ఈ ఈఎంఐ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. 3, 6, 9 నెలలు.. ఇలా వివిధ కాల వ్యవధులను ఎంచుకోవచ్చు. బ్యాంకును బట్టి వడ్డీ రేటు ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu