అల్పాదాయ వర్గాల వారికి ఎల్ఈడి బల్బులు, బాటిన్ ట్యూబ్ లైట్లు , ఫైవ్ స్టార్ బిఎల్డిసి ఫ్యాన్లు !


కేంద్ర ప్రభుత్వం, విద్యుత్ శాఖ జాయింట్ వెంచర్ అయిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ తో ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 1.50 లక్షల పేదల ఇళ్లకు విద్యుత్ ఉపకరణాలను అందించేందుకు ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఏపీలోని 1,50,000 ఇళ్లకు ఎల్ఈడి బల్బులు, ట్యూబ్ లైట్ లు, బి ఎల్ డి సి ఫ్యాన్లు అందించనున్నారు. విద్యుత్ను ఆదా చేసే క్రమంలోనే ఈ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అల్పాదాయ వర్గాల వారికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1.50 లక్షల ఇళ్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇళ్ల నిర్మాణదారులకు ఇప్పుడు కొత్త విద్యుత్ ఉపకరణాలను అందిస్తారు. ప్రతి ఇంటికి నాలుగు ఎల్ఈడి బల్బులు, రెండు బాటిన్ ట్యూబ్ లైట్లు , రెండు ఫైవ్ స్టార్ బిఎల్డిసి ఫ్యాన్లు అందజేయనున్నారు. వీటి వినియోగం ద్వారా లబ్ధిదారుల ఇళ్లల్లో విద్యుత్ ఆదా చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరికరాల సేకరణ, పంపిణీ ఈఈఎస్ఎల్ అధికారుల పర్యవేక్షణలో జరగనుంది. దేశవ్యాప్తంగా ఇంధన ఆదా కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఏపీతో కేంద్ర ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుంది.

No comments:

Post a Comment

3