Ad Code

యూరప్‌కు అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా భారత్‌ !


భారతదేశం యూరప్‌కు అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా అవతరించింది. కెప్లర్‌ నివేదిక ప్రకారం భారతీయ రిఫైనరీల నుంచి యూరోపియన్‌ యూనియన్‌ దేశాలకు శుద్ధి చేసిన ముడి చమురు ఎగుమతిలో అనూహ్యంగా పెరుగుదల నమోదైంది. ప్రతిరోజూ 3.60లక్షల బ్యారెల్స్‌ శుద్ధి చేసిన ముడి చమురును యూరప్‌కు ఎగుమతి చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి ఎగుమతులు 20లక్షల బ్యారెల్స్‌ను దాటుతుందని అంచనాలున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారత్ రోజుకు 1.54 లక్షల బ్యారెల్స్‌ యూరప్‌కు ఎగుమతి చేసింది. యుద్ధం మొదలయ్యాక రెండులక్షల బ్యారెల్స్‌కు పెరిగింది. కెప్లర్‌ నివేదిక ప్రకారం భారతీయ రిఫైనరీలు హైక్వాలిటీ పెట్రోల్‌, డీజిల్‌, ఇతర శుద్ధి చేసిన ఉత్పత్తులతో సరఫరా గణనీయంగా పెరిగింది. దీంతో సౌదీ అరేబియాను కాదని భారత్‌ వైపు దృష్టి సారిస్తున్నాయి. భారత్‌ రాబోయే కాలంలో మరింతగా తన స్థానాన్ని పదిలం చేసుకోనున్నది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో పలు దేశాలో రష్యాపై ఆంక్షల నేపథ్యంలో భారత్‌కు భారీ తగ్గింపుతో ముడి చమురును అందించింది. 2023 ఆర్థిక సంవత్సరంలో మాస్కోకు భారత్‌ కీలక మార్కెట్‌గా మారింది. పలు దేశాలు విమర్శలు చేసినప్పటికీ రష్యా నుంచే భారత్‌ ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్నది. ఇదే జరుగకపోతే పెరుగుతున్న చమురు ధరలు, ద్రవోల్బణం నేపథ్యంలో భారతదేశం తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేది. రష్యా నుంచి 3.35 బిలియన్లు, సౌదీ నుంచి 2.30 బిలియన్లు, ఇరాక్‌ 2.03 బిలియన్‌ డాలర్ల ముడి చమురును భారత్‌ దిగుమతి చేసుకుంటున్నది.

Post a Comment

0 Comments

Close Menu