పశ్చిమ బెంగాల్లో ముస్లింలదరినీ ముక్కలు ముక్కలుగా నరికి పాతిపెడతామని అని నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రె్స(టీఎంసీ) నేత హుమయూన్ కబీర్ హిందువులను భాగీరథి నదిలో ముంచేస్తానన్న వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఆయన ఈ మాటలు అన్నారు. పశ్చిమ బెంగాల్లో వచ్చే నెలలో ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో మిథున్ చక్రవర్తి పాల్గొన్నారు. ''ఆ నేత (కబీర్) వ్యాఖ్యలపై సీఎం మమత స్పందిస్తారని చూశాను. కానీ, స్పందించలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను. వాళ్లను ముక్కలుగా నరికేస్తాం. భూమిలో పాతేస్తాం. భాగీరథి నది మాకు తల్లిలాంటిది. అందుకే వాళ్లను అందులో వేయం'' అన్నారు. మిథున్ చక్రవర్తి ఈ వ్యాఖ్యలు చేసేప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పక్కనే ఉన్నారు.
మిథున్ చక్రవర్తి వివాదాస్పద వ్యాఖ్యలు !
by Telugu Lo Computer at October 29, 2024
Labels:
national
,
west bengal
,
టీఎంసీ నేత హుమయూన్ కబీర్ హిందువులను భాగీరథి నదిలో ముంచేస్తానన్న వ్యాఖ్యలను గుర్తు చేస్తూ
,
మిథున్ చక్రవర్తి వివాదాస్పద వ్యాఖ్యలు
,
ముస్లింలదరినీ ముక్కలు ముక్కలుగా నరికి పాతిపెడతాం
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment