హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఏయన్నార్ జాతీయ అవార్డు 2024 వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకులకు టాలీవుడ్ తారా తోరణం హాజరయింది. కాగా ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి నాగార్జున ఫ్యామిలీతో పాటు చిరంజీవి ఫ్యామిలీ కూడా వచ్చింది. అమితాబ్ బచ్చన్ ఈ అవార్డుల వేడుకకు గెస్ట్‌గా వచ్చాడు. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా చిరంజీవికి ఏఎన్నార్ అవార్డు ఇవ్వనున్నట్లు అక్కినేని కుటుంబం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును బిగ్ బి అమితాబ్, చిరంజీవికి ప్రధానం చేశాడు. కాగా.. అమితాబ్, చిరంజీవికి శాలువా కప్పి సన్మానించాడు. అంతేకాకుండా మెగాస్టార్‌ను దగ్గరకు తీసుకొని అమితాబ్ ఆలింగనం చేసుకున్నాడు. చిరంజీవి, అమితాబ్ బచ్చన్ పాదాలకు నమస్కరించి ఎంత ఎదిగిన ఒదిగుండాలని అనే సూత్రాన్ని గుర్తుచేశాడు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. నేను రచ్చ గెలిచి ఇంట గెలిచానేమో అనిపిస్తుందని చిరంజీవి అన్నాడు. బయటవాళ్లు తనను ఎంత పొగిడినా, తన తండ్రి మాత్రం పొగిడే వాడు కాదని.. బిడ్డల్ని పొగిడితే ఆయుక్షీణం అని ఆయన భావించేవారని చిరంజీవి తెలిపాడు. చిరంజీవి మాటలకు తల్లి అంజనమ్మ మురిసిపోయింది. ఈ వేడుకలో నాగేశ్వరరావు మరణానికి ముందు మాట్లాడిన చివరి ఆడియోను వినిపించారు. నా కోసం మీరంతా దేవుడిని ప్రార్థిస్తున్నారని తెలుసు. మీ ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు. త్వరలోనే మీ ముందుకు వస్తాననే నమ్మకం ఉంది. మీ ప్రేమకు రుణపడి ఉంటా. ఇక సెలవు అని ఐసీయూలో మాట్లాడారు. ఇది విన్న చిరంజీవి ఎమోషనల్ అయ్యాడు.
0 Comments