హైదరాబాద్ లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ నువ్వు తక్షణమే నార్కోటిక్ టెస్ట్ చేయించుకొని సర్టిఫికెట్ చూపించు అని సూచన చేశారు. డ్రగ్స్ కు కేటీఆర్ కు ఏం సంబందం? డ్రగ్స్ అనగానే ప్రతి సారి కేటీఆర్ ఎందుకు స్పందిస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఇల్లీగల్ గా అక్కడికి పారిన్ లిక్కర్ ఎందుకు వచ్చింది? కేటీఆర్ కు సిగ్గు శరం ఉందా? అని ధ్వజమెత్తారు. కేటీఆర్ బామ్మర్ది జన్వాడ పామ్ హౌస్ లో పేకాట, డ్రగ్స్, క్యాషియోతో అడ్డంగా దొరికిపోయిండు. హవాయ్ చెప్పులు వేసుకున్న కేసీఆర్ కుటుంబానికి ఇన్ని కోట్లు ఎక్కడినుండి వచ్చినవి అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు 50 మంది ఆస్తులపై వెంటనే విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జన్వాడ పామ్ హౌస్ పై వాస్తవాలు చూపించినందుకు ఆరోజు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని 40 రోజులు జైల్లో పెట్టారు. అండర్ ట్రయల్ ముద్దాయిగా పెట్టి రేవంత్ రెడ్డిని చంపాలని చూశారని ఆరోపించారు. ప్రతి వారం ఫాంహౌస్లో రాజ్ పాకాల రేవ్ పార్టీ నిర్వహిస్తాడని, పక్కా సమాచారంతోనే పోలీసులు దాడి చేశారని ఆరోపణలు చేశారు. త్వరలో వాస్తవాలు అన్ని ప్రజల ముందు పెడతామన్నారు.
కేటీఆర్ నువ్వు తక్షణమే నార్కోటిక్ టెస్ట్ చేయించుకుని సర్టిఫికెట్ చూపించు : షబ్బీర్ అలీ సూచన
by Telugu Lo Computer at October 28, 2024
Labels:
telangana
,
కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ సూచన
,
కేటీఆర్ నువ్వు తక్షణమే నార్కోటిక్ టెస్ట్ చేయించుకుని సర్టిఫికెట్ చూపించు
,
డ్రగ్స్ కు కేటీఆర్ కు ఏం సంబందం?
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment