బీపీఎల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ గోపాల్‌ నంబియార్‌ కన్నుమూత !


బీపీఎల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ టీపీ గోపాలన్‌ నంబియార్‌ (94) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. గోపాలన్‌ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌కు గోపాలన్‌ మావయ్య అవుతారు. గోపాలన్‌ మృతిని ధ్రువీకరిస్తూ ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. దేశీయ కన్జూమర్‌ బ్రాండ్‌ను నెలకొల్పిన దార్శనికుడు దూరమయ్యారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org