Ad Code

భారత ఆర్థిక వృద్ధి బ్రిక్స్ దేశాలకు ఆదర్శం : వ్లాదిమిర్ పుతిన్


ష్యాలోని కజాన్ నగరంలో జరిగిన 16వ బ్రిక్స్ సదస్సులో పుతిన్  మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వృద్ధిని కొనియాడారు. భారతదేశ ఆర్థిక వృద్ధి బ్రిక్స్ దేశాలకు ఉదాహరణ అంటూ పేర్కొన్నారు. మూడు రోజుల సదస్సులో పాల్గొన్నందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. అధిక ఆర్థిక వృద్ధి రేటును నిర్ధారించాల్సిన అవసరం గురించి తామందరం చర్చినట్లు తెలిపారు. ఆర్థిక వృద్ధి విషయంలో మోడీ దీన్ని విజయవంతంగా చేయగలుగుతున్నారంటూ పుతిన్ ప్రశంసించారు. ఈ మేరకు రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని టాస్ వార్తా సంస్థ పేర్కొంది. ''భారత ఆర్థిక వృద్ధి భేష్. 7.5% వృద్ధి ఫలితాలపై భారత్ ను అభినందిస్తున్నాము. ఇది మనలో చాలా మందికి ఒక ఉదాహరణ. ఈ చొరవకు ధన్యవాదాలు.'' అంటూ పుతిన్ పేర్కొన్నారని వార్తా సంస్థ ప్రచురించింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం 7 శాతంగా ఉంది. 2025లో 6.5 శాతంగా ఉంటుందని ఇప్పటికే ఐఎంఎఫ్ అంచనా వేసింది. బ్రిక్స్ సదస్సుకు ముందు ఈ అంతర్జాతీయ ద్రవ్య నిధి భారత ఆర్థిక వృద్ధిపై కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాలను 7 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తూ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) కీలక ప్రకటనచేసింది. కాగా ఈ సదస్సులో కూటమి దేశాధినేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్రిక్స్ కూటమిలో మరో ఆరు కొత్త సభ్య దేశాలను చేర్చుకోవాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో అర్జెంటీనా, ఈజిప్ట్​, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్​కు బ్రిక్స్ కూటమిలో చోటు దక్కనుంది. ప్రస్తుతం బ్రిక్స్‌లో బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధికి చెందిన సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో దేశం స్థూల ఆర్థిక ప్రాథమిక అంశాలు బాగున్నాయని పుతిన్ వెల్లడించడం మంచి పరిణామన్నారు.

Post a Comment

0 Comments

Close Menu