ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమాడ గ్రామంలో ఓ జంట పెళ్లి వేడుక జరుగుతుంది. నూతన దంపతులకు పలువురు స్టేజ్‌పైకి వచ్చి కానుకలు ఇచ్చి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇంతలో వంశీ అనే వ్యక్తి తన స్నేహితులు కొంత మందితో స్జేజ్‌పైకి వచ్చాడు. నవవధువరులకు వారంతా గిఫ్ట్ ఇచ్చారు. వారిచ్చిన బహుమతిని వరుడు తెరచి చూస్తుండగా స్నేహితులంతా ఆనందంగా నవ్వుతూ చూడసాగారు. ఇంతలో వంశీ ఒక్కసారిగా స్టేజ్‌పైనే కుప్పకూలాడు. ఏం జరుగుతుందో తెలిసేలోపు అక్కడే ప్రాణాలొదిలాడు. వంశీ అమెజాన్‌లో ఉద్యోగి. బెంగళూరులో విధులు నిర్వహిస్తున్న వంశీ స్నేహితుడి పెళ్లికి వచ్చి ప్రాణాలొదలడంతో బంధుమిత్రులు విషాదంలో మునిగి పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో వరుడు బహుమతిని విప్పుతుండగా వంశీ తన ఎడమ వైపుకు వంగి బ్యాలెన్స్ కోల్పోవడం కనిపిస్తుంది. వెంటనే అతన్ని ధోన్ సిటీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు వంశీ చనిపోయినట్లు ప్రకటించారు.
0 Comments