చికెన్ మోమోస్ తిని మహిళ మృతి !


హైదరాబాద్‌ లోని బంజారాహిల్స్ నందినగర్ లో మోమోస్‌ తిని ఓ మహిళ మృతి చెందింది. మరో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై బాధితులు బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. నందినగర్ వారాంతపు సంతలో చికెన్‌ మోమోస్ కొనుగోలు చేసి తిన్న వారికి ఫుడ్ పాయిజన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. సింగాడికుంటకు చెందిన ఓ వివాహిత మృతి చెందింది. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమచారం. బాధితులు నగరంలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనపై పోలీసుల విచారణ చేపట్టారు. వారాంతపు సంతలో మెమోస్ పెట్టారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని నందినగర్, సింగాడకుంట బస్తీ, గౌరీ శంకర్ కాలనీలో శుక్రవారం నాడు జరిగిన సంతలో మోమోస్‌ విక్రయించారు. ఇక్కడ మోమోస్ కొనుగోలు చేసిన సింగాడకుంట బస్తీకి చెందిన రేష్మ బేగం (31), ఆమె పిల్లలు, స్థానికంగా సుమారు 50 మంది వీటిని తిని అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 10 మంది మైనర్లు ఉన్నారు. మోమోస్ తిన్న వారందరికీ శనివారం నుంచి వాంతులు, విరేచనాలు కావడంతో బంజారాహిల్స్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స కోసం చేరారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మోమోస్ తిన్న రేష్మ బేగం ఆరోగ్యం విషమించడంతో ఆమెను నిమ్స్ ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందింది. ఈ ఘటనపై బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోమోస్ విక్రయించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మోమోస్‌తో పాటు ఇచ్చిన మయోనైజ్‌, చట్నీ కలుషితమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

No comments:

Post a Comment

3