న్యూఢిల్లీలోని రిడ్జ్ ప్రాంతంలో చెట్లు నరికివేతకు సంబంధించి కోర్టు అనుమతి తీసుకోవాలనే విషయం తనకు తెలియదని సుప్రీంకోర్టుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా అన్నారు. బుధవారం సుప్రీంకోర్టుకు ఎల్జీ అఫిడవిట్‌ను సమర్పించారు. రిడ్జ్ ప్రాంతంలో చెట్లు నరికివేతకు తాము ఎటువంటి అనుమతి ఇవ్వలేదని కోర్టు స్పష్టం చేసింది. అయినా మీరు చెట్లు ఎందుకు నరికి వేశారని లెఫ్టినెంట్ గవర్నర్‌కు సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఎల్జీ పైవిధంగా సమాధానమిచ్చారు.రిడ్జ్ ప్రాంతంలో 11 వందల చెట్లు నరికి వేసినట్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 22వ తేదీ లోపు స్పందించాలంటూ ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారటీ(డీడీఏ)కి సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించింది. దాంతో ఎల్జీ అఫిడవిట్ దాఖలు చేశారు. డీడీఏకు చైర్ పర్సన్‌గా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో సుప్రీంకోర్టుకు ఆయన అఫిడవిట్ సమర్పించారు. అంతకుముందు 600 నుంచి 650 చెట్లు అక్రమంగా నరికివేశారని ఆరోపణల నేపథ్యంలో అందుకు బాధ్యుత వహించడానికి మీరు ఏ విధమైన చర్యలు చేపట్టారని ఎల్ జీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. చెట్ల నరికివేతకు కోర్టు ధిక్కార కేసుగా పరిగణిస్తున్నామని తెలిపింది. అయితే చైర్ పర్సన్ అంగీకరిస్తే.. చెట్లు నరికి వేతకు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ చర్యలకు ఉపక్రమించవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. రిడ్జి ప్రాంతంలో వందలాది చెట్లు నరికివేత అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం పలు ప్రశ్నలు సంధించింది. ఆ క్రమంలో ఫిబ్రవరి 3వ తేదీన ఆ ప్రదేశాన్ని సందర్శించిన సక్సేనా గురించి, అలాగే చెట్ల నరికివేతపై ఆయనకున్న అవగాహన గురించి కోర్టు ప్రశ్నించింది. చెట్లను నరికివేయడానికి అనుమతి కోరుతూ డీడీఏ చేసిన దరఖాస్తుపై కూడా కోర్టు ఆరా తీసింది. ఈ ఏడాది అంటే 2024, ఫిబ్రవరి 3వ తేదీన సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రహదారిని ఢిల్లీ ఎల్జీ వీకే సక్సెనా సందర్శించారు. రైట్ ఆప్ వేలో చెట్లను తొలగించాలని ఎల్జీ ఆదేశించారు. అందుకు సంబంధించిన అంశాలు చెట్లు నరికిన సంస్థలు.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో స్పష్టం చేశాయి. దీనిపై ఢిల్లీలోని ఆప్ మంత్రులు స్పందించారు. ఈ వ్యవహారంలో ప్రమేయమున్న ఎల్జీ వీకే సక్సెనా తన పదవికి రాజీనామా చేయాలని గతంలోనే డిమాండ్ చేసింది. ఇందులో బీజేపీ, ఎల్జీ పాత్ర ఉందని ఆప్ ఆరోపించింది. దీనిపై చర్చకు సిద్దమా అంటూ ఎల్జీ వీకే సక్సెనాకు ఆప్ సవాల్ విసిరింది.
0 Comments