భారత్, చైనా మధ్య కుదిరిన కీలక ఒప్పందంలో భాగంగా తూర్పు లద్దాఖ్‌లో ఎల్‌ఏసీ వెంట గత నాలుగేళ్లుగా నెలకొన్న ప్రతిష్ఠంభన ఎట్టకేలకు తెరపడింది. మూడురోజుల కిందట ఎల్‌ఏసీ వెంట బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలవగా మంగళవారం నాటికి దాదాపు 90శాతం పూర్తయ్యిందని రక్షణ వర్గాలు వెల్లడించాయి. దెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాల్లో బలగాలు వెనక్కి మళ్లే ప్రక్రియ ముగిసినట్లేనని తెలిపాయి. భారత్, చైనా సైన్యాలు ఒకరి స్థావరాలను మరొకరు పరస్పరం తనిఖీ చేసుకుంటున్నాయని, మౌలిక సదుపాయాలను సైతం తొలగించారా? లేదా? అనే విషయం క్లారిటీ కోసమే తనిఖీలు జరుగుతున్నాయని తీయ మీడియా పేర్కొంది. తూర్పు లడఖ్‌లోని ఎల్ఏసీ వెంబడి పెట్రోలింగ్, దళాల ఉపసంహరణకు భారత్, చైనా ఒప్పందాన్ని కుదిరింది. దాంతో గాల్వాన్ లోయలో భారత్, చైనా దళాల మధ్య ఘర్షణతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్, చైనా సైన్యం మధ్య కమాండర్ చర్చలు జరిగాయి. అదే సమయంలోనూ దౌత్య మార్గంలోనూ చర్చలు జరగ్గా.. ఇటీవల బలగాలను వెనక్కి తీసుకునేందుకు అంగీకరించడంతో నాలుగేళ్ల ప్రతిష్ఠంభనకు తెరపడినట్లయ్యింది. ఇరుదేశాల మధ్య ఒప్పందం జరగ్గా.. ఈ ఒప్పందానికి ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆమోదం తెలిపారు.
0 Comments