ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై నేటి నుంచి సమీక్షలు !


ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై జిల్లా అధ్యక్షులు, నియోజక వర్గ, మండల స్థాయి నేతలతో సమీక్షలు నిర్వహించడానికి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేటి నుంచి 28 వరకు విజయవాడలోనే ఉండనున్నారు. ఈరోజు మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. 2029 నాటికి ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి పూర్వవైభవం సాధించే దిశగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి కసరత్తు చేస్తున్నారు. 25న అరకు, విజయనగరం, విశాఖపట్నం,అనకాపల్లి జిల్లాల నేతలతో సమావేశం. 26న కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం జిల్లాల నేతలతో సమావేశం. 27న ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ,గుంటూరు జిల్లాల నేతలతో సమావేశం. 28న నంద్యాల , కర్నూలు, ఒంగోలు, నెల్లూరు జిల్లాల నేతలతో సమావేశం. నవంబర్ 6న బాపట్ల, నరసాపురం, అనంతపురం, హిందూపూర్ జిల్లాల నేతల సమీక్ష సమావేశం కానున్నారు. నవంబర్ 7న కడప, రాజంపేట, తిరుపతి, చిత్తూరు జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org